![]() |
![]() |
.webp)
నటి ప్రగతి గురించి తెలుగు సినీ ప్రేక్షకులు అందరికీ తెలుసు. మూవీస్ లో ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్నారు. నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుని మరీ సినిమాలు చేస్తున్నారు. అలాగే ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చే ఆమె, తన వర్కవుట్స్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా షేర్ చేస్తుంటారు.
ఐతే ఈమె రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన పెళ్ళికి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. "రెండో పెళ్లిపై మీరేమనుకుంటున్నారు? మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనిపించలేదా, ఇవ్వాళ రేపు ఇది కామన్ కదా" అని యాంకర్ అడిగేసరికి.. ప్రగతి స్పందించారు.
"పెళ్లి అనేదానికన్నా కంపానియన్ అనేది ఇంపార్టెంట్. నాకు కూడా కంపానియన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అది కూడా నా మెచ్యూరిటీ లెవెల్‌కి మ్యాచ్ అయ్యే వారు దొరకాలి కదా.. రాసి పెట్టి ఉంటే అది కచ్చితంగా జరుగుతుందని నమ్ముతాను. అయినా నాతో అడ్జస్ట్ అవడం చాలా కష్టం. ఎందుకంటే.. కొన్ని విషయాల్లో నేను చాలా పర్టిక్యులర్ గా ఉంటాను. 20లలో ఉంటే నేను అడ్జెస్ట్ అయ్యేదాన్నేమో కానీ ఇప్పుడు కష్టం.. మా అబ్బాయి బెంగుళూరులో జాబ్ చేసుకుంటున్నాడు.. కూతురు యూఎస్ కి వెళ్ళింది..వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి ఒక ప్రౌడ్ మదర్ అని గర్వంగా చెప్పుకుంటాను” అంటూ చెప్పుకొచ్చారు.
![]() |
![]() |